ACB Inquiry Against Former APMDC MD Venkatreddy : వైఎస్సార్సీపీ పాలనలో ఇసుక టెండర్ల , తవ్వకాలు, విక్రయాలు, సరఫరా వరకూ ప్రతి దశలోనూ అవకతవకలు జరిగింది నిజమేనని గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఏసీబీ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. గుత్తేదారు సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించింది వాస్తవమేనని కానీ అవన్నీ ‘అత్యున్నత స్థాయి’ నుంచి అందిన ఆదేశాలకు అనుగుణంగా జరిగినవేనని చెప్పినట్లు తెలిసింది. 'దయచేసి ఆ పేర్లు అడగొద్దు. నేను చెప్పలేను. ఆ ఆదేశాలూ నేరుగా కాకుండా వివిధ దశల్లో నాకు చేరేవి' అంటూ వెంకటరెడ్డి చెప్పుకొచ్చినట్లు సమాచారం .