CP CV Anand On DJ Sound Pollution : డీజేల వాడకం విషయంలో త్వరలో గైడ్లైన్స్ జారీ చేస్తామని రాష్ట్ర డీజీపీ ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా పోలీసు ఉన్నతాధికారులు కార్యచరణ ప్రారంభించారు. ర్యాలీల్లో డీజేలు, టపాసుల వాడకంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. డీజే శబ్దాల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని నివాసాల్లో వయసు మీరిన వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని సీపీ తెలిపారు.