Vijayawada Floods Effect on Printing Sector: ముద్రణా రంగానికి పెట్టింది పేరు విజయవాడ. ప్రింటింగ్ ప్రెస్సులకు హబ్‌గా ఉన్న విజయవాడ, వరదల దెబ్బకు అతలాకుతలమైంది. ఏడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ రంగానికి వరదలు భారీ నష్టాలను మిగిల్చాయి. విజయవాడ శివారులోని సింగ్ నగర్, పాయకాపురం, ప్రకాశ్ నగర్, కండ్రిక, రాజరాజేశ్వరిపేటలో అత్యధికంగా ఉండే ప్రింటింగ్ ప్రెస్‌లు తీవ్రంగా నష్టపోయాయి. కోట్లాది రూపాయలు నష్టపోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని నిర్వాహకులు వేడుకుంటున్నారు.