Minister Sridhar Babu on Investments In Telangana : ప్రతిపక్షాలు పెట్టుబడులపై చేస్తున్న దుష్ప్రచారం తగదని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. కొన్ని కంపెనీలు వారి విధానాల ప్రకారం ప్లాంట్లను విస్తరించడం సాధారణంగా జరిగే ప్రక్రియ అన్నారు. సచివాలయంలో ఇష్టాగోష్టిలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఏసీ సిటీ గురించి ఫ్యూచర్ సిటీలో చర్చించినట్లు వివరించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలి వచ్చి ఉపాధిని సృష్టంచడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.