Sridhar Babu On Six Guarantees : ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. అందులో భాగంగా రేపు 31వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. విద్య, వైద్య రంగాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం ఈ రెండింటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు.