Home Minister Anitha Comments On Jagan Security : ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ మోహన్ రెడ్డికి 950 మందితో భద్రత ఎందుకని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. ప్రస్తుతం 58 మందితో జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. జగన్ అధికారంలో ఉన్నప్పడు విదేశాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కూడా రాష్ట్ర పోలీస్ భద్రత ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పటికి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఎటువంటి భద్రత తీసుకోలేదని తెలిపారు.