Union Minister Rammohan Naidu on Bhogapuram Airport: నిర్దేశిత లక్ష్యం కంటే 6 నెలలు ముందే భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణపనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ సంస్థలు జీఎమ్ఆర్, ఎల్ అండ్ టీ ప్రతినిధులతో సమీక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విమానయాన అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని రామ్మోహన్ మరోసారి చెప్పారు.