Pawan Kalyan Comments on Panchayats: పల్లెటూర్లు దేశానికి పట్టుగొమ్మలు, గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి మార్గమన్న మహాత్మా గాంధీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలను బలోపేతం చేస్తోందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పలుమార్లు అధికారులతో సమిక్ష నిర్వహించిన తర్వాత మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పవన్ వెల్లడించారు.