Pawan Kalyan About Panchayat Funds: 14,15 ఆర్ధిక సంఘం నిధులు కింద 2019 నుంచి 2024 వరకూ గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు వివరాలను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. కేంద్రం నుంచి నిధులు విడుదలైనా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నిలిపివేత కారణంగా పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. గత ప్రభుత్వం ఎవరి అనుమతి తీసుకోకుండానే 14వ ఆర్ధిక సంఘం ఇచ్చిన సోమ్ములో కొంత డిస్కంలకు పంపేసిందని విమర్శించారు.