BRS Niranjan reddy fires Congress : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోందని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన, చిత్తశుద్ది లేక కృష్ణనదిలో దిగువకు వెళ్తున్న నీటిని ఒడిసి పట్టుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. పాలమూరు బిడ్డ అని పదేపదే చెప్పే సీఎం రేవంత్‌రెడ్డి, ఇక్కడి రైతులు కష్టాలు పడుతుంటే అమెరికాలో మిస్సిసీపీ అందాలు చూస్తూ కూర్చుంటారా? అని మండిపడ్డారు.