Minister Nadendla Manohar Delhi Tour: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్ష టన్నుల కందిపప్పు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, హర్దీప్ సింగ్ పూరీతో దిల్లీలో మంత్రి మనోహర్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో సమావేశంలో వైఎస్సార్సీపీపై మండిపడ్డారు. వైఎస్సార్సీపీ తాడూ బొంగరం లేని పార్టీ అని, అధ్యకుడెవరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.