Mini Gokulam Scheme in AP : పశుపోషకులకు చేయూత అందించేందుకు, పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు 2018లో తెలుగుదేశం ప్రభుత్వం మినీ గోకులాలను ప్రారంభించింది. వాటిని వైఎస్సార్సీపీ సర్కార్ విస్మరించింది. లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెట్టింది. అందుకే కూటమి ప్రభుత్వం పాడి పరిశ్రమపై ప్రత్యేక దృష్టిపెట్టి మినీ గోకులాల నిర్మాణాలకు పచ్చజెండా ఊపింది. పశుపోషకులకు 90 శాతం, జీవాలు, కోళ్ల పెంపకందారులకు 70 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పాడిపరిశ్రమకు పూర్వవైభవం వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.