India's First google code lab at guntur VVIT College : బీటెక్, ఏంటెక్లు చేసినా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మీద పట్టు లేకపోవడంతో పోటీ ప్రపంచంలో యువత వెనుకపడిపోతున్నారు. కొత్త సాంకేతికతతో సరికొత్త అవకాశాలు పలకరిస్తున్నా అందరూ అందిపుచ్చుకోలేకపోతున్నారు. దీంతో ఏ పట్టా పొందింనా చివరికి మళ్లీ ప్రత్యేకంగా నైపుణ్య కోర్సులు చేయక తప్పడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు గుంటూరు వీవీఐటీ కళాశాలలోని గూగుల్ కోడ్ లాబ్స్ నైపుణ్య శిక్షణ అందిస్తోంది. ఇటీవలే గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు చక్కటి అవకాశాలు అందించే జెన్ ఏఐ ప్రోగ్రాంను ప్రారంభించారు.