విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయం అది. అక్కడ రాజకీయాలకు చోటుండకూడదు. కానీ గత ఐదేళ్లు ఆ వర్సిటీ కులపతి, ఉప కులపతులు ఒంటెద్దు పోకడలు పోయారు. ఏకపక్ష నిర్ణయాలతో విద్యార్థులను, అధ్యాపకులను ఇబ్బంది పెట్టారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం రాకతో బాధితులంతా స్వేచ్ఛగా బైటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతున్నారు.