Nuziveedu IIIT was Destroyed by YCP Government : నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రతిష్ఠను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మసకబార్చింది. గత ఐదేళ్లుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటున్న ట్రిపుల్ ఐటీలో తరచి చూస్తే అంతులేని అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. పనుల పేరిట అందినకాడికి దోచుకున్న దగ్గరి నుంచి ప్రాంగణాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చి భ్రష్టుపట్టించిన వైనంపై ప్రత్యేక కథనం.