NEET Exam : నీట్ పరీక్షకు 3 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఓ విద్యార్థిని పరీక్ష రాయలేకపోయింది. ఆమె తల్లి ఎంత బతిమిలాడినా పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు. తన కుమార్తెను పరీక్ష రాసేందుకు అనుమతించాలని ఎంతగా ప్రాధేయపడినా అధికారులు అంగీకరించకపోవడంతో విద్యార్థిని తల్లి కన్నీరుమున్నీరయ్యారు. కరీంనగర్లోని మహిళల డిగ్రీ, పీజీ కళాశాలలో నీట్ పరీక్ష రాసేందుకు వేములవాడ నుంచి తన తల్లితో విద్యార్థిని బయలుదేరింది. 3 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఓ విద్యార్థిని పరీక్ష రాయలేకపోయింది.