Gurukul Student Died in Peddapur : జగిత్యాల జిల్లాలో పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై ఓ విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. గత పది రోజుల క్రితం కూడా ఇదే గురుకులాల్లో ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కాగా ఒక విద్యార్థి మృతి చెందారు. మళ్లీ ఇప్పుడు విద్యార్థులు అస్వస్థతకు గురవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.