BJP Ready To End Alliance With TDP

  • 6 years ago
The BJP on Sunday held a state-executive committee meeting to discuss the crisis with the TDP. based on accusations made by the TDP against BJP national leaders, Bharatiya Janata Yuva Morcha president Vishnuvardhan Reddy had asked two of its state cabinet ministers to resign from their posts.

ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం ఒక్కటొక్కటిగా నెరవేరుస్తున్నప్పటికీ మిత్రపక్షం తెలుగుదేశం తమపై దాడి చేస్తోందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదని ఏపీ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆదివారం విజయవాడలోని హోటల్ ఐలాపురంలో బీజేపీ నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా బీజేపీ నేతలు టీడీపీపై నిప్పులు చెరిగారు. అవసరమైతే చంద్రబాబు కేబినెట్ నుంచి తప్పుకోవాలని బీజేపీ నిర్ణయించిందని తెలుస్తోంది.
ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చకుంటే మార్చి 6వ తేదీన కీలక నిర్ణయం తీసుకుంటామని టీడీపీ హెచ్చరిస్తూ వస్తోంది. ఇద్దరు కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలతో రాజీనామా చేయించే యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, అంతకుముందే మేల్కొన్న బీజేపీ.. తాము హామీలు నెరవేరుస్తున్నప్పటికీ ఆరోపణలు చేస్తుండటంతో టీడీపీ కంటే ముందే వారు రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. హోదాకు బదులు ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని చంద్రబాబు ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేకపోయిదని విమర్శించారు. పైగా తమపైకి నెపం నెట్టివేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వం నుంచి తక్షణమే తాము బయటకు వచ్చేయాలని భావిస్తున్నామని, ఈ క్రమంలో తమ మంత్రులు మాణిక్యాల రావు, కామినేని శ్రీనివాస్‌లు రాజీనామా సమర్పించాలని తీర్మానించారని, కొద్ది రోజుల్లో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పారు. దీని ఆమోదానికి అధిష్టానంపై ఒత్తిడి తెస్తామన్నారు.గడిచిన నాలుగేళ్లలో టీడీపీ చేసిన అన్యాయాలను సీడీల రూపంలో ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. సీడీల రూపకల్పన కోసం ఏబీవీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

Recommended