BJP State Executive Meeting: పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్కు, ఎన్డీఏ కూటమి విధానాలకు అనుకూలంగా ప్రజలు ఓటు వేశారని పురందేశ్వరి పేర్కొన్నారు. దేశంలో ఎన్డీఏ కూటమి చరిత్రాత్మక విజయం సాధించి మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టారని కేంద్రమంత్రి మురగన్ తెలిపారు. రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు.