సిద్దిపేట జిల్లా కోమటి బండ లో మిషన్ భగీరథ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ముఖ్యమంత్రి గారి కార్యదర్శి స్మిత సభర్వాల్, ఈ.ఎన్. సి కృపాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సప్లయ్ చేయడానికి మిషన్ భగీరథ వాటర్ బాటిళ్లను మంత్రి ఆవిష్కరించారు. చీఫ్ ఇంజినీర్లు, అన్ని జిల్లాల ఎస్.ఈ, ఈ.ఈ , డీ. ఈఈ, జె.ఈఈ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.