Telangana : The state cabinet has taken key decisions. The state cabinet has approved the implementation of 42 percent BC reservation in local body elections. For this, it has decided to amend the Panchayat Raj Act-2018. As part of this, an ordinance is expected to be issued soon. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం-–2018కి సవరణలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయాలని భావిస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు మండలం యూనిట్ గా రిజర్వేషన్ అమలు చేయనున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు జిల్లా యూనిట్ గా.. జెడ్పీ చైర్పర్సన్లకు రాష్ట్రం యూనిట్ గా రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లు ఎవరి పోరాటం వల్ల వచ్చాయో చర్చలు జరుగుతున్నాయి. జాగృతి అధ్యక్షురాలు కవిత తమ పోరాటం వల్లే రిజర్వేషన్లు వచ్చాయని చెబుతున్నారు. కానీ తీన్మార్ మల్లన్న మాత్రం ఇది బీసీల విజయమని చెబుతున్నారు. #bcreservation #cmrevanthreddy #theenmarmallanna
Also Read
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం..! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-cabinet-sensational-decision-on-bc-reservations-443009.html?ref=DMDesc
జాగృతిలో జోరు పెంచిన కవిత.. రంగం సిద్ధం! (వీడియో) :: https://telugu.oneindia.com/news/telangana/telangana-jagruti-president-kalvakuntla-kavitha-speaks-at-a-meeting-in-kothagudem-442949.html?ref=DMDesc