Congress leader and former MLA Mynampally Hanmantha Rao said that they have been patient with KTR for years.. but if he continues to speak arrogantly and self-servingly against CM Revanth Reddy, they will not be satisfied. He warned that if provoked, they will resort to attacks. He spoke to the media at Gandhi Bhavan on Saturday. కేటీఆర్ విషయంలో ఇన్నాళ్లు ఓపిక పట్టామని.. ఇంకా అలాగే సీఎం రేవంత్‌రెడ్డిపై అహంకారపూరితంగా, ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రెచ్చగొడితే దాడులకూ పాల్పడతామని హెచ్చరించారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. రేవంత్ పై అతిగా మాట్లాడితే బావ, బామ్మర్దులను బట్టలు విప్పి నడిరోడ్డు మీద నిలబెడతానని కేటీఆర్, హరీశ్‌ను మైనంపల్లి హెచ్చరించారు. ఇలాగే ప్రవర్తిస్తే జీవితంలో కూడా కేటీఆర్ సీఎం కాలేడని అన్నారు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పై, రేవంత్ పై విష ప్రచారం సాగిస్తున్నారని ఆరోపించారు. #ktr #mynampallyhanmantharao #congress
లోకేష్ తో భేటీ వెనుక, అసలు విషయం చెప్పిన కేటీఆర్..!! :: https://telugu.oneindia.com/news/telangana/ktr-reacts-over-his-meeting-with-ap-minister-lokesh-details-here-444041.html?ref=DMDesc