Vizianagaram Farmers About HPCL Pipeline Construction : జాతీయ రహదారి నిర్మాణానికి కొంత, గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటుకు మరికొంత, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కాల్వల తవ్వకానికి ఇంకొత, ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉమ్మడి విజయనగరం జిల్లా రైతులు పచ్చని పొలాలను కోల్పోయారు. తాజాగా హెచ్పీసీఎల్ పైపు లైన్ ఏర్పాటుకు మరోసారి భూసేకరణకు అధికారులు సమాయత్తమవడంతో బాధిత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విశాఖ-రాయపూర్ వరకు హెచ్పీసీఎల్ పైపు లైన్ ఏర్పాటు వల్ల తమ జీవనాధారం, కుటుంబాల పరిస్థితి ఏంటని బాధిత రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.