DR BR Ambedkar 134th Birth Anniversary Celebrations in AP : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు అంబేడ్కర్‌ను స్మరించుకున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం పరితపించిన బాబాసాహెబ్ ఆశయ సాధన కోసం కృషిచేద్దామని పిలుపునిచ్చారు.