CM CHANDRABABU UGADI CELEBRATIONS: ప్రపంచంలో భారత్, భారతీయులు అగ్రస్థానంలో ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. భారతీయులు అగ్రస్థానంలో ఉంటే నాయకత్వం వహించే శక్తి తెలుగుజాతికి ఇవ్వాలని అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.