Home Minister Anita on TTD Gosala Issue : తిరుమల గోశాలలో గోవులు చనిపోయాయన్న భూమన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలతో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. టీటీడీ గోశాలలో 260 మంది సిబ్బంది గోసంరక్షణ చేస్తున్నారని గుర్తుచేశారు. 2,668 ఆవులకు జియో ట్యాగ్ చేసి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.