Nagababu Visit to Pithapuram : కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుమారపురంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్సీ నాగబాబు హాజరయ్యారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు బలాబలాలు ప్రదర్శించుకున్నారు. జై వర్మ, జై టీడీపీ అంటూ తెలుగుదేశం శ్రేణులు నినాదాలు చేశారు. అందుకు ప్రతిగా జై జనసేన, జై పవన్ అంటూ జనసైనికులు నినాదాలు చేశారు. సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు వర్మకు ఆహ్వానం లేదంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు.