Nag Panchami Festival 2024 : నాగరాజు, నాగజ్యోతి, నాగరాణి, నాగచైతన్య ఇలా ఏ ఇంట్లో చూసినా అవే పేర్లు. అవునండి! ఇలా "నా" అక్షరంతోనే ఆ గ్రామంలో అత్యధికులు ఉంటారు. నిత్యం నాగదేవతను కొలుస్తూ, నా అనే అక్షరం కలిసేలా నామకరణం చేస్తూ అందరిని ఆకర్షిస్తుంది. జగిత్యాల జిల్లాలోని నాగులపేట గ్రామం. ఇవాళ నాగులపంచమి సందర్భంగా ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.