దాసరి, జయలలితకు ఘన నివాళి.. ఇఫీలో మేఘ సందేశం ప్రదర్శన

  • 7 years ago
For invaluable contribution to the Indian cinema, the International Film Festival of India (IFFI) will pay tributes to industry veterans who passed away, said the festival director Sunit Tandon.

భారతీయ సినిమాకు విశేష సేవలందించిన దివంగత సినీ ప్రముఖులకు భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ2017) ఘనంగా నివాళులర్పించనున్నామని ఫెస్టివల్ డైరెక్టర్ సునిత్ టాండన్ వెల్లడించారు. సినీ ప్రముఖులను భారతీయ చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా విషాదకరం. వారు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఇఫీ వారి సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకొంటుంది అని టాండన్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇఫీ నివాలర్పించే జాబితాలో ఇటీవల మరణించిన సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, ఓం పురి, వినోద్ ఖన్నా, టామ్ అల్టర్, రీమా లాగూ, జయలలిత, అబ్దుల్ మజీద్, కుందన్ సా, రామానంద్ సేన్ గుప్తా (సినిమాటోగ్రాఫర్) ఉన్నారు.
ఇఫీలో దాసరి నారాయణరావు రూపొందించిన మేఘ సందేశం, ఓంపురి నటించిన అర్థసత్య, వినోద్ ఖన్నా నటించిన అచానక్, జానే భీ దో యారో, షా, అల్టర్ రూపొందించిన ఓషియన్ ఆఫ్ యాన్ ఓల్డ్ మ్యాన్, రిమా లాగూ నటించిన సవాలీ, జయలలిత నటించిన అయిరాథిల్ ఒరువన్, మజీద్ రావు రూపొందించిన చమేలీ మేమ్‌సాబ్ తదితర చిత్రాలను ప్రదర్శించనున్నారు.