Devotees Problmes in Annavaram : అన్నవరం ఆలయంలో భక్తులకు ఏసీ గదుల కేటాయింపును అధికారులు నిలిపేశారు. నీటిని పొదుపుగా వాడేందుకు గదుల కేటాయింపు నిలుపుదల చేయాలని ఈవో ఆదేశించారు. అన్నవరం పంపా రిజర్వాయర్లో నీటి నిల్వలు అడుగంటాయని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో దేవాలయానికి నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే పంపాలోకి ఏలేరు నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో ఆలయంలో ఉన్న 500 గదుల్లో 300 గదులు ఏసీవే కావడంతో భక్తులు వసతికి ఇబ్బందులు పడుతున్నారు.