Large Number Of Illegal Lodges Emerged in Mantralayam : మంత్రాలయానికి నిత్యం వేలాదిగా వచ్చే భక్తుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు పెద్దసంఖ్యలో లాడ్జీలు వెలిశాయి. చాలా మంది నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను లాడ్జీలుగా మార్చి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇలాంటివారిని గుర్తించి నోటీసులిచ్చిన యంత్రాంగం నిర్దేశిత గడువులోగా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది.