Earth Quakes In Two Telugu State : తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ రోజు ఉదయం 7.27 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై, ఇళ్ల నుంచి పరుగులు తీశారు. తెలంగాణలోని ముగులు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. 55 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని హైదరాబాద్లోని సీఎస్ఐఆర్ - ఎన్జీఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలో మీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది.