తిరుమల శ్రీవారి సన్నిధిని కొందరు స్థానికేతరులు అపవిత్రం చేస్తున్నారు. బాలాజీ నగర్ సమీపంలోని పాచికాల్వ గంగమ్మ ఆలయ ప్రాంతంలో ఎటు చూసినా ఖాళీ మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయి. బాలాజీ నగర్‌ని పక్కన టీటీడీ ఇంజినీరింగ్ విభాగం లేబర్ కాలనీ ఏర్పాటు చేసింది. కార్మికుల ముసుగులో కొందరు వ్యక్తులు మద్యం సేవించి భక్తుల రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తున్నారు.