Lokesh on WhatsApp Governance : వాట్సప్ గవర్నెన్స్‌పై అసెంబ్లీలో లఘు చర్చపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థను రూపు మాపి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లారని, చంద్రబాబు పౌరసేవలను ఈ-సేవగా మార్చి జనం వద్దకు పాలన తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. పాదయాత్ర ద్వారా ప్రజులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పూర్తిగా అర్ధం చేసుకున్నానని చెప్పారు. సర్కార్ నుంచి సేవలు అందుకోవాలంటే చేతులు కట్టుకుని నిల్చున్న పరిస్థితి వారిదని వివరించారు.