Minister Nara Lokesh Launches WhatsApp Governance in AP : దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ ను ప్రారంభించింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్ శ్రీకారం చుట్టారు. దీనికోసం అధికారిక వాట్సప్ నంబర్ 95523 00009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్ ట్యాగ్(టిక్ మార్క్) ఉంటుంది. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు పౌరసేవలు అందివ్వడంతో పాటు వినతులు స్వీకరిస్తారు. అలాగే వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది.