Consumer Complaint From WhatsApp :వినియోగదారుల కోసం కేంద్రం వాట్సప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేస్తే నేరుగా జాతీయ వినియోగదారుల కమిషన్ వెబ్సైట్లో నమోదు అవుతుంది. ధ్రువీకరణ పత్రాల నుంచి ఫిర్యాదుల దాకా అంతా ఆన్లైన్లోనే చేసుకునే వెసులుబాటు కల్పించింది. నాణ్యమైన సేవలను వినియోగదారులు పొందాలనే ఉద్దేశంతో కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ‘వాట్సప్ చాట్‌బాట్' సేవలను తీసుకొచ్చింది