Atchannaidu vs Botsa Discussion on Free Sand in Mandali : ఉచిత ఇసుక విధానంపై శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఉచిత ఇసుక విధానం వల్ల పేదవాడికి ఎలాంటి లబ్ధి చేకూరడం లేదని గతంలో కంటే పెద్దగా మార్పు లేదని వైఎస్సార్సీపీ సభ్యులు తోట త్రిమూర్తులు, బొత్స సత్యనారాయణ విమర్శించారు. స్థానికంగా టీడీపీ నాయకులు భారీగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తోట త్రిమూర్తులు ఆరోపించారు.