Telangana High court Serious On HYDRA : హైడ్రాపై మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏ ప్రక్రియ అయినా చట్టబద్ధంగా సాగాలన్న ఉన్నత న్యాయస్థానం రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేయలేరని స్పష్టం చేసింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపడుతూ భరోసాకు బదులు భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడింది. పరిధి దాటి వ్యవహరిస్తే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది.