CM Brother Reacts on Hydra Notices : బీఆర్ఎస్ నాయకులు తనను లక్ష్యంగా చేసుకుని దుర్గం చెరువు అమర్ సొసైటీలోని నివాసితులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఆరోపించారు. తన నివాసం బఫర్ జోన్‌లో ఉందంటూ రెవెన్యూ నోటీసులు అందాయని, నిబంధనల ప్రకారం లేకుంటే తన ఇంటిని కూల్చేయొచ్చని ఆయన స్పష్టం చేశారు.