Hydra Clarity On Demolitions : రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో కొత్తగా నిర్మాణ దశలో ఉన్న నివాసాలు, నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తైన ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదని ప్రకటించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ప్రజలెవరూ ఇళ్లు, ప్లాట్లు, భూములు కొనుగోలు చేయవద్దని రంగనాథ్ సూచించారు.