Hydra Registered Cases Against Officers In Hyderabad : హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సైబరాబాద్ పోలీసులు ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినందుకు వారిపై చర్యలు చేపట్టాలని 2 రోజుల క్రితం హైడ్రా సిఫారసు చేసింది. ఇదే తరహాలో అక్రమార్కులకు సహకరించిన మరికొంతమంది అధికారులపై కేసులు పెట్టేందుకు రంగం సిద్ధమతున్నట్లు తెలుస్తోంది.