Lake Protection Teams In Hyderabad : చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపైనే కాకుండా వాటి రక్షణ కోసం హైడ్రా ప్రత్యేకంగా నిఘా పెడుతోంది. ఇకపై చెరువును ఆక్రమించాలన్న ఆలోచన వస్తే చాలు హైడ్రాకు సమాచారం అందేలా ప్రత్యేకంగా "లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్"ను ఏర్పాటు చేసింది. ఒక్కో చెరువునకు ఇద్దరి చొప్పున రక్షకులను ఏర్పాటు చేసింది. వారి నిఘాలో ఎప్పటికప్పుడు చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షిస్తోంది.