Shailaja Kiron Visits Katuri Art Gallery: ఇనుము, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను పునర్వియోగించే పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఆమె సందర్శించారు. 2 సంవత్సరాల క్రితం మరణించిన తన తండ్రి సుందరనాయుడు విగ్రహం తెనాలి కాటూరి శిల్పశాలలో తయారవుతోంది. విగ్రహం తుదిరూపును పరిశీలించి కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. విగ్రహం చాలా బాగా తయారైందని శిల్పులను అభినందించారు. ఆర్ట్ గ్యాలరీలోని విగ్రహాలను తిలకించారు.