వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. సత్యవర్థన్ను బెదిరించిన కేసులో వంశీతోపాటు మరో ఇద్దరు నిందితులకు రిమాండ్ విధించడంతో వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. సత్యవర్థన్ను బెదిరించిన కేసులో వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.