Students Injured After Anganwadi Center Roof : అంగన్వాడీ భవనం పైకప్పు పెచ్చులూడి విద్యార్థులు గాయాలుపాలైన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో కలకలం రేపింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై జిల్లా కలెక్టర్ సైతం స్పందించి గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.