Rat Bite to Students in Medak : ఉమ్మడి మెదక్ జిల్లాలోని గురుకుల పాఠశాల బాలికలను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామాయంపేట సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో 12 మందిని ఎలుకలు కరిచాయి. వెంటనే సదరు బాధిత అమ్మాయిలను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.