CM Chandrababu Speech in Zurich : రాజకీయాల్లోకి వచ్చేలా యువతను ఎక్కువగా ప్రోత్సహించానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందని చెప్పారు. యూరప్‌లోని 12 దేశాల నుంచి ఈ సమావేశానికి వచ్చారని పేర్కొన్నారు. అవకాశం ఉన్న ప్రతిచోటుకూ మనవాళ్లు వెళ్లిపోతారని వివరించారు. తెలుగువాళ్లు ఎక్కడైనా గొప్పగా పని చేస్తారని అదేవిధంగా రాణిస్తారని అన్నారు. జ్యూరిచ్‌లో ఏర్పాటు చేసిన తెలుగు పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రుల భేటీలో ఆయన పాల్గొని మాట్లాడారు.