Sankranti Rush in AP 2025 : రాష్ట్రంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు ప్రాంతాలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తదితర ప్రాంతాలకు 116 అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదనపు బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని పేర్కొంది. సాధారణ ఛార్జీలే వసూల చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది.