Padi Kaushik Reddy Vs Arekapudi : రాజకీయాల కోసం ఆంధ్రా, తెలంగాణ అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఆంధ్ర వాళ్లను తాను తిట్టినట్లు కాంగ్రెస్ వాళ్లు నీచ రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆక్షేపించారు. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీల మధ్య చెలరేగిన చిచ్చు చల్లారటం లేదు. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో రాష్ట్ర రాజకీయాలు క్షణం క్షణం ఉత్కంఠగా మారుతున్నాయి.