Cockfights Competition in AP : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి వేళ బరుల్లో కాలు దువ్వేందుకు కోడి పుంజులు సిద్ధమయ్యాయి. ఏటా కోట్లలో చేతులు మారే ఈ పందేల కోసం శ్రద్ధ తీసుకుని మరీ పుంజులను పెంచుతారు. ప్రత్యేక ఆహారం, శిక్షణ సరేసరి. పోలీసుల హెచ్చరికలు ఉన్నా సంక్రాంతి అంటే కోడిపందాలే అనేలా ఈసారీ పుంజులను పెంపకందారులు సిద్ధం చేశారు.